నాణ్యమైన భోజనం అందించాలి.. | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం అందించాలి..

Oct 9 2026 12:26 AM | Updated on Oct 9 2026 12:26 AM

నాణ్యమైన భోజనం అందించాలి..

జిల్లాకేంద్రంలోని ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో

విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాల, కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నమోదు, హాజరు శాతం, గతేడాది సాధించిన ఉత్తీర్ణత శాతం తదితర వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. గతేడాది ఇంట ర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎన్‌ఐటీ, ఐఐటీకి ఎంతమంది నేరుగా అర్హత సాధించారనే వివరాలను ఆరాతీశారు. ఆయా విద్యార్థులతో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించాలని, వచ్చే ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు ఎన్‌ఐటీ, ఐఐటీ, త్రిబుల్‌ ఐటీల్లో సీట్లు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇంటర్మీడియట్‌ విద్యార్థుల విద్యా సామర్థ్యాల పరిశీలనకు బోర్డుపై లెక్కలు రాసి పరిష్కరించాల్సిందిగా సూచించారు. భోజనం, ఇతర వసతులు బాగున్నాయా.. ఏమైనా సమస్యలున్నాయా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టోర్‌రూంను పరిశీలించి నిల్వ ఉన్న నిత్యావసరాల నాణ్యతను పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement