బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకోవాలి

Oct 9 2026 12:26 AM | Updated on Oct 9 2026 12:26 AM

వనపర్తి: యువత బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకుంటూ పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శివకుమార్‌ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని స్కాలర్స్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో యూనియన్‌ బ్యాంక్‌ క్లస్టర్‌ ఆధ్వర్యంలో బ్యాంకింగ్‌ సేవలు, పొదుపు, రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ‘యూనియన్‌ యువ కనెక్ట్‌–బ్యాంకింగ్‌ ఫర్‌ యూత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కళాశాల విద్యార్థులకు బ్యాంకింగ్‌ సేవలు, పొదుపు ఖాతాలు, కరెంట్‌ ఖాతాలు, రుణాలు, డిపాజిట్‌ పథకాలపై అవగాహన కల్పించారు. పొదుపు, కరెంట్‌ ఖాతా ప్రారంభించే విధానం, బ్యాంకు అందించే వివిధ డిపాజిట్లు, రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీమా పథకాలు తదితర అంశాలను వివరించారు. అలాగే డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు, యూనియన్‌ ఈజ్‌ వంటి డిజిటల్‌ సేవల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆర్థిక అక్షరాస్యత ప్రాధాన్యతను వివరిస్తూ యువత చిన్న వయస్సు నుంచే పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని, బ్యాంకింగ్‌ సేవలను సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా అందించే శిక్షణ కార్యక్రమాలను కూడా వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ జగదీశ్వర్‌, ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, అధ్యాపకులు, యూనియన్‌ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ లోకేష్‌, ఐడీఓసీ శాఖ మేనేజర్‌ వినయ్‌, ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌, సీఎఫ్‌ఎల్‌ కౌన్సిలర్లు, యూనియన్‌ బ్యాంక్‌ వనపర్తి క్లస్టర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement