వనపర్తి రూరల్: ప్రభుత్వం వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలంటూ గురువారం నాగరాల, తాటిపాముల, కంబాళాపురం, తండా రైతులు, ప్రజలు శ్రీరంగాపురం సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ కోతలతో బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లో–ఓల్టేజీ సమస్యతో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయని.. విద్యుత్ సమస్యతో పంటలు కళ్ల ఎదుటే ఎండిపోతుంటే చూసి ఏడ్చే పరిస్థితి నెలకొందన్నారు. ఏఈతో ఫోన్‌లో మాట్లాడితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సరఫరా చేస్తున్నామని సమాధానమిచ్చారని తెలిపారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.


