పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన

Oct 9 2026 12:26 AM | Updated on Oct 9 2026 12:26 AM

గోపాల్‌పేట: అర్హులకు మాత్రమే చేయూత పింఛన్లు అందేలా అధికారులు దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. గురువారం మండలంలోని చాకల్‌పల్లిలో పర్యటించి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, అనర్హులను ఎట్టిపరిస్థితుల్లో ఎంపిక చేయొద్దని సూచించారు. అనంతరం చాకల్‌పల్లి గ్రామపంచాయతీలో రికార్డులు పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామంలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సర్పంచ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో 1,100కు పైగా ఓట్లు ఉండగా.. ప్రస్తుతం 1,050 వచ్చాయని తెలిపారు. డబుల్‌, అనర్హుల ఓట్లు తొలగించి ఉండొచ్చని సర్పంచ్‌ శేషిరెడ్డి వివరించారు. ఆయన వెంట ఎంపీడీఓ అయేషా, ఎంపీఓ భవాని, పంచాయతీ కార్యదర్శి పార్వతి, వార్డు సభ్యులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement