అమరచింత: ఉగాది పురస్కరించుకొని పట్టణంలో గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం అంతర్రాష్ట్ర ఎద్దుల గిరకలాగు పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జింక సువర్ణ, కౌన్సిలర్లు మాధవి, తిరుమల్లేష్ హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. తెలుగు సంవత్సరాది రోజున రైతు సోదరులు గిరకలాగు పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అరుణ్‌కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య తదితరులు పాల్గొన్నారు.


