గుడిపర్తి రిజర్వాయర్‌ను పరిశీలించిన మాజీ మంత్రి | - | Sakshi
Sakshi News home page

గుడిపర్తి రిజర్వాయర్‌ను పరిశీలించిన మాజీ మంత్రి

Mar 25 2026 8:09 AM | Updated on Mar 25 2026 8:09 AM

గోపాల్‌పేట: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో జలకళ అని, తెలంగాణ సాకారమయ్యకే సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రేవల్లి మండలంలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్వకుర్తి పరిధిలో రైతులకు మరో 40 రోజులు నీరు ఇవ్వాల్సి ఉంటుందని, శ్రీశైలంలోని ప్రతిచుక్కను వినియోగించుకోవాలన్నారు. కల్వకుర్తికి మోటార్లతో 240 రోజులు సాగునీరు ఇవ్వవచ్చన్నారు. అసంపూర్తిగా ఉన్న కేఎల్‌ఐ కాల్వకు రూ.3వేల కోట్లతో ఎలక్ట్రో మెకానికల్‌ వర్క్స్‌, టన్నెల్‌, కాల్వలు, పవర్‌లైన్స్‌, సర్జిపూల్‌, మోటార్లు పూర్తి చేసి 4 లక్షల ఎకరాకలు సాగునీరు అందించామన్నారు. అలాగే భూగర్భ జలాల ద్వారా మరో లక్ష ఎకరాలకు నీరందించామని మొత్తం ఐదు లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో కేసీఆర్‌ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారన్నారు. 90 శాతం పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయనతో వెంట గట్టుయాదవ్‌, వాకిటి శ్రీధర్‌, నందిమల్ల అశోక్‌, శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement