● ఈద్గాల వద్ద ముస్లింల
సామూహిక ప్రార్థనలు
● శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ
ప్రముఖులు
వనపర్తిటౌన్: భగవంతుడు ఒక్కడే అని విశ్వసిస్తూ దైవ ప్రార్థన, ఉపవాసాలు, దానధర్మాలు, మక్కా యాత్ర పంచసూత్రలపై ఆధారపడి ఉండటమే రంజాన్ మాసం ప్రత్యేకత అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నెలరోజుల ఉపవాసాల అనంతరం శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో జిల్లాలోని ముస్లింలు శనివారం రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పుర కేంద్రాల్లోని ఈద్గాలు, మసీద్‌ల వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం రాజకీయ ప్రముఖులు, అధికారులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకేంద్రంలోని గోపాల్‌పేట రోడ్‌లో ఉన్న ఈద్గా, శ్రీనివాసపురంలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, నందిమళ్ల అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు ముస్లింల నివాసాలకు చిన్నారెడ్డి, మేఘారెడ్డి, ఆలిండియా మెడికల్ విభాగం రాష్ట్ర సమన్వయకర్త జిల్లెల్ల ఆదిత్యరెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలుపగా, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తన నివాసంలో కలిసిన ముస్లింలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ ఎం.మాధవి, పీసీసీ సభ్యుడు శంకర్‌ప్రసాద్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, నాయకులు చరణ్‌రెడ్డి, ఆదిత్య పాల్గొన్నారు.
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకి టి శ్రీహరి ఆత్మకూర్ ఈద్గా వద్ద ము స్లింలకు పండుగ శుభా కాంక్షలు తెలిపారు.
పోలీస్ బందోబస్తు..
జిల్లాకేంద్రంలోని ఈద్గాలు, మజీద్‌ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం రహదారులపై ముస్లింలు నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


