ఎన్నికల కోడ్‌ పక్కాగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ పక్కాగా అమలు చేయాలి

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

● అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి

విజయనగరం గంటస్తంభం: ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్‌)ని తక్షణమే అమలు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో ఆయన బుధవారం సాయంత్రం అత్యవసర టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్‌ పోస్టర్లు, హోర్డింగులను వెంటనే తొలగించాలన్నారు. నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని, శిలాఫలకాలపై పేర్లు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ, ఎక్స్‌పెండిచర్‌ మానిటరింగ్‌ బృందాలను వెంటనే రంగంలోకి దించాలని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలు, సామగ్రి పంపిణీ కేంద్రాలను గుర్తించి రూట్‌ మ్యాప్‌లతో నివేదిక సమర్పించాలని మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించడంతో పాటు, సర్పంచ్‌ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు.

కంట్రోల్‌ రూమ్‌ పాత్ర కీలకం..

ఎన్నికల పర్యవేక్షణలో కంట్రోల్‌ రూమ్‌ పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్‌ పేర్కొన్నారు. కంట్రోల్‌ రూమ్‌ 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయాలని, సిబ్బందికి షిప్టుల వారీగా బాధ్యతలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లు, సమాచార మార్పిడి, ఫిర్యాదుల పరిష్కారం, అత్యవసర పరిస్థితుల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, డీఆర్వో సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement