సర్కారు నవ్వుల పాలు..! | - | Sakshi
Sakshi News home page

సర్కారు నవ్వుల పాలు..!

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

సర్కారు నవ్వుల పాలు..!

● అంగన్‌వాడీ కేంద్రాలకు అందనిపాలు

● 14వ తేదీ వచ్చినా సరఫరా కాని

పౌష్టికాహారం

విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రతిరోజు పాలు అందిస్తారు. కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు కేంద్రంలో మరిగించి పాలు ఇస్తారు. గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఇంటికి పాలు అందిస్తారు. అయితే ఈనెల 14 వతేదీ వచ్చినా ఇంతవరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు చేరలేదు. దీంతో లబ్ధిదారులకు పాలు అందలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో అధికశాతం మంది పేద వారే.

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వివరాలు

జిల్లాలో బాడంగి, భోగాపురం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, రాజం, ఎస్‌.కోట, వియ్యంపేట, విజయనగరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 292 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, 2,207 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.

71,991 మంది లబ్ధిదారులు

జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 71,991 మంది లబ్ధిదారులు ఉన్నారు. గర్భిణులు 7,300 మంది, బాలింతలు 7, 077 మంది ఉన్నారు. ఆరు నెలల లోపు చిన్నారులు 6,509 మంది , ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 35,208మంది ఉన్నారు. 3 నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 15897 మంది ఉన్నారు.

100 ఎంఎల్‌ పాలు ఇవ్వాలి

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజూ 100 ఎంఎల్‌ పాలు ఇవ్వాలి. గర్భిణులు, బాలింతలకు నెలకు 5 లీటర్ల పాలు ఇవ్వాలి. 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు నెలకు రెండున్నర లీటర్ల పాలు ఇవ్వాలి. ఈ లెక్కన నెలకు 1,99,647 లీటర్ల పాలు జిల్లాకు అవసరం. ప్రతి నెల ఒకటో తేదీనాటికి పాలు అంగన్‌వాడీ కేంద్రాలకు చేరాల్సి ఉంది. ఒకటో తేదీ నాటికి పాలు చేరినట్లయితే అంగన్‌వాడీ కార్యకర్తలు బాలింతలు, గర్భిణులు, 3 ఏళ్ల లోపు చిన్నారులకు ఇంటికి పాలు అందిస్తారు. అయితే ఈనెల 14వతేదీ వచ్చినా కేంద్రాలకు పాలు చేరకపోవడంతో లబ్ధిదారులకు అందని పరిస్థితి. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో పిల్లలు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ పిల్లలకు భోజనం పెడుతున్నారు. గర్భిణులు, బాలింతలకు టేక్‌హోం రేషన్‌ పేరుతో బియ్యం, బెల్లం, ఖర్జూరం, వేరుశెనగ చక్కీలు, గుడ్లు , రాగి పిండి, అటుకులు, పాలు ఇస్తారు. అయితే ఈ పౌష్టికాహారం సకాలంలో లబ్ధిదారులకు చేరినట్లయితే లక్ష్యం నేరవేరతుంది.

విచారణ చేసి చర్యలు

కొన్ని కేంద్రాలకు పాలు చేరాయి. ఏ కేంద్రాలకు అయితే పాలు చేరలేదో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

కేవీ బాలమణి, పీడీ, ఐసీడీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement