ఊరెళ్తున్నారా..తస్మాత్‌ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

ఊరెళ్తున్నారా..తస్మాత్‌ జాగ్రత్త

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

ఊరెళ్తున్నారా..తస్మాత్‌ జాగ్రత్త

● ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలు

వినియోగించుకోవాలి

రాజాం సిటీ: మీ ప్రయాణమే వరంగా దొంగలు భావించి ఇళ్లల్లో చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో దాచుకునే సొత్తు క్షణాల్లో దోచుకెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇంటిల్లిపాది దూర ప్రాంతాలకు ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దొంగతనాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌)ను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. క్యాంపులు వెళ్లేవారంతా ఆభరణాలను ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారి ఇళ్లకు పోలీసులు సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు పర్యవేక్షణ చేపట్టనున్నారు. దీనికి ఎటువంటి ఖర్చులేకుండా సేవలు పొందవచ్చు.

జాగ్రత్తలు తప్పనిసరి..

● ఊరికి వెళ్లే సమయంలో ఇంటిలోని అన్ని తలుపులకు తాళాలు వేయాలి.

● ముఖ్యంగా ఇంటి ముఖద్వారానికి వేసే తాళం నాసిరకం కాకుండా చూసుకోవాలి.

● ఇరుగుపొరుగు వారికి తమ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. అలాగే రోజుకు ఒకటిరెండుసార్లు తమ ఇంటి గురించి ఫోన్‌చేసి తెలుసుకుంటూ ఉండాలి.

● నమ్మకమైన వ్యక్తులను రాత్రిపూట పడుకునేలా ఏర్పాటుచేయడం శ్రేయస్కరం.

● లాకర్‌ ఉన్న వారు బంగారు ఆభరణాలను లాకర్‌లో భద్రపర్చుకోవడం మంచిది.

● ప్రస్తుతం మార్కెట్‌లో వైఫైతో కూడిన సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాటిని అమర్చుకుని ఆండ్రాయిడ్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇంటిని పరిశీలించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement