విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 ఆదేశాలు బేఖాతరు! సిరిమాను తరలించేందుకు గట్టి బందోబస్తు ● డీఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తి ● గత నెల 23న కోమటిపల్లి మరడాం మధ్యలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో బిహార్‌కు చెందిన లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ● పెదమానాపురం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. ● బొండపల్లి బోడసింగిపేట, బూడిపేట మధ్యలో సైకిల్‌పై పాలు తీసుకొని వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా... ●అవగాహన కల్పిస్తున్నాం

న్యూస్‌రీల్‌

ఆసరా కోసం ఎదురు చూపు

ఒకే ఇంట్లో ఇద్దరు దివ్యాంగులు

జాతీయ రహదారి–26పై

ప్రమాదాల జోరు

వేకువజామున హైవేపై మృత్యు క్రీడ

నెల రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు

రోడ్డున పడుతున్న కుటుంబాలు

అతివేగం, మద్యం మత్తు, స్టాపర్లు

గుర్తించకపోవడం ప్రమాదాలకు కారణం!

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
ఆదేశాలు బేఖాతరు!

శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా

ప్రారంభమయ్యాయి.

అంబటివలస లోని సంతోషిమాత ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి

విగ్ర హం చూపరులను ఆకర్షిస్తోంది.

– బొండపల్లి

షికారుగంజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో

నుజ్జయిన ఆటో(ఫైల్‌)

కటిక చీకట్లో బతుకు ఛిద్రం

పార్వతీపురం రూరల్‌ : పుట్టుకతోనే కంటి చూపు కరువైన తల్లి... ఈ తల్లికి దివ్యాంగురాలైన కుమార్తె... ఇంకేముంది.. ఆ ఇంట బతుకు చిత్రం కటిక చీకట్లోనే మగ్గుతోంది. అయినా పాలకులు, అధికారులకు వీరి దయనీయమైన దుస్థితి కనిపించడం లేదు. వారి గోడు చెవులకు వినిపించడం లేదు. చూసే వారికి అయ్యో... అన్న బాధ కలుగుతున్నా... అధికారుల కంటికి వీరి బాధ కనిపించక, వీరి గోడు పాలకులకు వినిపించక దినదినం అష్టకష్టాలు పడుతున్నారు. మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ కొత్తవలసకు చెందిన గమ్మెల శాంతి హృదయ విదారక పరిస్థితి ఇది. జన్మతః అంధురాలైన శాంతికి ఆపరేషన్‌ చేసినా చూపు రాదని వైద్యులు తేల్చేశారు. ఆమె భర్త మద్యానికి బానిసయ్యాడు. శాంతికి ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్దమ్మాయి లావణ్య సైతం పుట్టుకతోనే దివ్యాంగురాలు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ పాపకు మంజూరైన పింఛన్‌ డబ్బులతోనే ప్రస్తుతం ఆ కుటుంబ జీవనం సాగుతోంది. తేలునాయుడువలసలో బడికి వెళ్లొస్తూ.. ఆ చిన్నారే తల్లికి పనుల్లో సాయపడుతోంది. నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు దివ్యాంగుల పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా నేటికీ మంజూరు కాలేదని శాంతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందిస్తారా?

విజయనగరం టౌన్‌: సిరులతల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా జొన్నవలస గ్రామంలో కొలువుదీరిన సిరిమా ను, ఇరుసుమానులను సోమవారం శాస్త్రోక్తంగా విజయనగరం హుకుంపేటకు తీసుకువచ్చే క్రమంలో జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయనగరం డీ ఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తి స్వీయ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, 160 మంది సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిమాను ప్రాంతంలో బారికేడింగ్‌లు, రోప్‌ పార్టీలు ఏర్పాటు చేశామని, స్టాపర్స్‌ పెట్టించామన్నారు. నిరంతరం సీసీ పర్యవేక్షణలో ప్రత్యే క క్యూలైన్స్‌ మెయింటెన్స్‌ చేపట్టామన్నారు.

ప్రమాదాలవే

షికారుగంజి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో

లారీ టైర్‌ కిందపడిన వ్యక్తి (ఫైల్‌)

దత్తిరాజేరు:

● గత నెల 12న జాతీయ రహదారి–26పై షికారు గంజి కూడలి వద్ద బాడంగి మండలం గజరా యునివలసకు చెందిన ముగ్గురు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృ తి చెందారు.

ఎన్‌హెచ్‌–26పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డెక్కిన వారు తిరిగి ఇంటికి చేరుకునేవరకు బెంగపడాల్సిన పరిస్థితి. ఇటీవల కాలంలో ఎస్‌.భూర్జవలస–పెదమానాపురం పోలీస్‌ స్టేషన్ల మధ్య వరుసగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాదాల్లో విగత జీవులుగా మారిన వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు.

తెల్లారుతున్న బతుకులు

పెదమానాపురం–ఎస్‌.భూర్జవలస పోలీస్‌స్టేషన్ల మధ్యలో 26వ జాతీయ రహదారిపై కొద్ది రోజులుగా తెల్లవారు జామునే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆత్రుతలో వాహనాలను వేగంగా నడపడం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం, రోడ్డుపై ఉన్న స్టాపర్లను గమనించకుండా ఢీ కొట్టడం, నిద్రమత్తులో ముందు వెళ్తున్న వారిని ఢీ కొనడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎంతోమంది బతుకులు తెల్లారుతున్నాయి. కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగుల్చుతున్నాయి.

జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదకర మలుపులు, బ్లాక్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, స్టాపర్లుగా ఇసుక డ్రమ్ములు, పాత టైర్లు ఉంచడం, వీటికి రేడియం స్టిక్కర్లు లేక పోవడం, రాత్రి సమయాలలో వర్షం కురిసినప్పుడు విద్యుత్‌ అంతరాయానికి అవి కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు వాటిని ఢీకొని గాయాలపాలవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు విడుస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది.

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్టాప ర్లు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం డ్రైవర్లకు, సాధారణ ప్రజలకు, వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. అతి వేగంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.

– ఎస్‌.సన్యాసినాయుడు, సీఐ, గజపతినగరం

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు బాస్‌ అయిన డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆదేశాలు సైతం విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి (డీఎంహెచ్‌ఓ ) అమలు చేయడం లేదని తెలిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంహెచ్‌ఓలు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆదేశాలు ఇచ్చిన మరుసటే రోజు అమలు చేశారు. విజయనగరం జిల్లాలో మాత్రం ఇంతవరకు అమలు చేయకపోవడం పట్ల విమర్శ లు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో సీసీ(క్యాంప్‌ క్లర్క్‌)లను క్షేత్ర స్థాయి లో పనిచేసే సిబ్బంది ఉంటే వారిని వెనక్కి పంపించేయాలని, వారి స్థానంలో మినిస్టీరియల్‌ సిబ్బంది ని నియమించుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆగస్టు నెలలో రాష్ట్రంలోని అందరు డీఎంహెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అందరూ డీఎంహెచ్‌ఓ లు వారి ఆదేశాలు అమలు చేశారు. రెండు నెలలు కావస్తున్నా.. విజయనగరం డీఎంహెచ్‌ఓ మాత్రం ఇంకా ఫీల్డ్‌ సిబ్బందినే సీసీలుగా కొనసాగిస్తున్నా రు. ఒక్కరు కాదు, ఇద్దరు సీసీలుగా కొనసాగించ డం పట్ల సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి ద్వారానే అన్ని రకాల వ్యవహారాలు జరుగుతుండడం వల్ల వారిని రిలీవ్‌ చేయడానికి డీఎంహెచ్‌ఓ ఇష్టపడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి వద్ద ప్రస్తావించగా త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement