సిరిమాను తరలింపునకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సిరిమాను తరలింపునకు సర్వం సిద్ధం

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

సిరిమాను తరలింపునకు సర్వం సిద్ధం

నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు తరలింపు జొన్నవలసలో 4 పార్కింగ్‌ కేంద్రాలు సిరిమాను వృక్షం వద్ద కంట్రోల్‌ రూమ్‌, వైద్య శిబిరం ఏర్పాటు

విజయనగరం రూరల్‌:

ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరి మాను ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన సిరిమాను వృక్షాలను సోమవారం జొన్నవలస నుంచి తీసుకువచ్చే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయ ని విజయనగరం గ్రామీణ తహసీల్దార్‌ జి.హేమంత్‌కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ, పోలీసు, దేవదాయ శాఖ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేశాయని చెప్పారు.

రెండు మార్గాలు... నాలుగు పార్కింగ్‌ ప్రదేశాలు

భక్తుల సౌకర్యార్థం విజయనగరం నుంచి దుప్పాడ మీదుగా, వీటి అగ్రహారం – బైపాస్‌ – సారిక రోడ్డు గుండా రెండు మార్గాల్లో వాహనాలపై వచ్చే భక్తుల కు రెండు ప్రధాన పార్కింగ్‌ కేంద్రాలు, రెండు అదనపు పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

విజయనగరం టౌన్‌ నుంచి దుప్పాడ మీదుగా వచ్చేవారికి జొన్నవలసలోని జానకిరామ నగర్‌ లే ఔట్‌లో ప్రధాన పార్కింగ్‌, దుప్పాడ కాలనీ సమీపంలో అదనపు పార్కింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. బైపాస్‌ రోడ్డు నుంచి జొన్నవ లస గ్రామానికి వచ్చేవారికి మాజీ ఎంపీటీసీ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రధాన పార్కింగ్‌, జొన్నవలస వాటర్‌ ట్యాంక్‌ వద్ద అదనపు పార్కింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. సిరిమాను వృక్షం సమీపంలోనే రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖల కంట్రో ల్‌ రూములు ఏర్పాటు చేశామని, వైద్య శిబిరంతో పాటు 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచా మని పేర్కొన్నారు.

మధ్యాహ్నం రెండున్నర గంటలకు తరలింపు ప్రక్రియ

పైడితల్లి అమ్మవారి సిరిమాను వృక్షం తరలింపు ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జొన్నవలస నుంచి ప్రారంభమవుతుందని తహసీల్దార్‌ తెలిపారు. దుప్పాడ, రైతుబజార్‌, ఆర్‌అండ్‌బీ జంక్షన్‌, ఎత్తు బ్రిడ్జి మీదుగా రైల్వే స్టేషన్‌, సీఎంఆర్‌ జంక్షన్‌, కన్యకా పరమేశ్వరి జంక్షన్‌ మీదుగా హుకుంపేటకు రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో చేరుకుంటుందని అధికారులు తెలిపారు. పట్టణంలో సిరిమాను తరలింపు సమయంలో ప్రజలు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా పోలీసుల సూచనలు పాటించి, సహకరించాలని కోరారు. సమావేశంలో అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement