ఇదేం పాడి పని..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం పాడి పని..!

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే అధికారులకే ఇబ్బంది

ప్రభుత్వాలు మంజూరు చేసిన సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజలకు అన్యాయం చేస్తే అధికారులే ఇబ్బంది పడతారు. నాయుడువలస పాడిరైతు సూర్యనారాయణకు గోకులం షెడ్డు మంజూరై గుర్తింపు సంఖ్య వచ్చినప్పటికీ స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో సంబంధిత అధికారులు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు.ఆ రైతుకు న్యాయం జరగకుంటే అధికారులపై కోర్టుకు వెళతాం.

– బెల్లాన చందుశేఖర్‌,మాజీ ఎంపీ, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు,మాజీ ఎమ్మెల్యే

రామభద్రపురం: కూటమి పాలనలో పాలకులు, అధికారులు పాడిరైతులపై రైతులపై వివక్షచూపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాడిరైతులకు కేంద్రప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాలు అందివ్వడంలో అధికార పార్టీ నాయుకుల ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాడిరైతులకు అవస్థలు తప్పడం లేదు. 2018–19 వరకు వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం గోకులం పేరుతో పశువులు,గొర్రెలు,మేకలు,కోళ్లకు షెడ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టింది. అప్పట్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ నిధులతో ఈ నిర్మాణాలు చేపట్టారు.అయితే టీడీపీ కార్యకర్తలకే వాటిని కేటాయించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాడిరైతులకు మినీ గోకులాల మంజూరుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 2088 మినీ గోకులాలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు 1899 మంజూరయ్యాయి.ఇందులో 468 మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. వాటిని అధికార పార్టీ పాలకులు టీడీపీ కార్యకర్తలకే మినీ గోకులాలు మంజూరు చేయాలి తప్ప వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు మంజూరు చేస్తే ఊరుకునేది లేదని సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు కూడా వారు చెప్పిన విధంగానే వైఎస్పార్‌సీపీ మద్దతు దారులుగా పేరున్న పాడిరైతులకు మినీ గోకులాలు మంజూరై, నిర్మాణాల ప్రారంభానికి కొలతలు కొలిచి కూడా మధ్యలో ఆపేసిన పరిస్థితి నెలకొంది.

పచ్చనేతల్లా వ్యవహరిస్తున్న అధికారులు..

మండలంలో ఎంపీడీవో, వీబీజీ రాంజీ సిబ్బంది పచ్చనేతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం..నాయుడువలసలో ఆరుగురు పాడి రైతులకు ఆరు మినీ గోకులాల షెడ్లు మంజూరయ్యాయి.అందులో నాలుగు టీడీపీకి చెందిన పాడిరైతులవి కాగా మిగతా రెండూ వైఎస్సార్‌సీపీకి చెందిన పాడిరైతులవి. ఇందులో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పాడిరైతు కేతిరెడ్డి సూర్యనారాయణకు ఒక గోకులం మంజూరైంది. అయితే ఆ రైతు నిర్మాణం ప్రారంభిస్తానంటే సంబంధిత టెక్నికల్‌ అసిస్టెంట్‌ వెళ్లి కొలతలు కూడా తీశారు.ఆ కొలతల పక్రారం రైతు మినీ గోకులం ప్రారంభించేసరికి స్థానిక టీడీపీ నాయకుల నుంచి నిర్మాణం ఆపించాలని ఎంపీడీవో, వీబీజీ రాంజీ సిబ్బందికి ఆదేశాలు వచ్చాయి.ఆదేశాలు రావడమే తడువు ఆయా అధికారులు ఆగమేఘాల మీద వెళ్లి మినీ గోకులం నిర్మాణాన్ని ఆపేశారు. నింబంధనలు పాటించాల్సిన అధికారులే పక్షపాత వైఖరి ప్రదర్శిచడంపై పాడిరైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడిరైతు సూర్యనారాయణ సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో సమస్యపై వినతి ఇచ్చి విన్నవించుకున్నాడు.

సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం..

పాడిరైతు పీజీఆర్‌ఎస్‌కు వెళ్లింది వాస్తవమే. కలెక్టర్‌ దగ్గర నుంచి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు వచ్చాయి. ఏపీవోతో చర్చించి మినీ గోకులం షెడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

– రత్నం, ఎంపీడీవో,రామభద్రపురం

వీబీజీ రాంజీ నిధులతో

పశువుల షెడ్లు

టీడీపీ కార్యకర్తలకే కేటాయించాలని అధికారులపై ఒత్తిళ్లు

వైఎస్సార్‌సీపీ మద్దతు దారు పాడిరైతులకు మంజూరైన గోకులం నిర్మాణాల నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement