రామభద్రపురం: మండలంలోని ఎస్.సీతారాపురంలో ఆదివారం పాముకాటుతో ఓ మహిళ మృతిచెందింది. గ్రామానికి చెందిన తెలుగు గంగమ్మ(48) ఆదివారం గ్రామ పరిధిలోని గుంటూరు నాయుడుకు చెందిన పొలంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్లింది.పత్తి తీస్తున్న సమయంలో గుర్తుతెలియని విషసర్పం కాటువేసింది. దీంతో వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తె రామారపు వరలక్ష్మి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆటోలో బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.అక్కడ వైద్యాధికారులు చికిత్స అందిస్తుండగా మృతిచెందింది.కుమార్తె ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ కేసునమోదు చేసి దరాప్తుచేస్తున్నారు.


