● స్పందించిన రెవెన్యూ అధికారులు
● స్థలం కేటాయింపు
వేపాడ: మండలంలోని జాకేరు గ్రామానికి చెందిన ముస్లింలు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ మృతదేహంతో మంగళవారం ఆందోళన చేశా రు. గ్రామానికి చెందిన షేక్ దర్గా మదీనా (48) అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవా రం రాత్రి మృతిచెందారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. గ్రామపెద్ద బుద్దా అప్పలనాయుడు, వీఆర్వో అప్పలరాము స్పందించి శ్మశానవాటిక పక్కన, లేదంటే సొంత స్థలంలో మూడుసెంట్లు స్థలం ఇస్తామని చెప్పినా ఆందోళన విరమించలేదు. తహసీల్దార్ జె.రాములమ్మ గ్రామానికి చేరుకుని హిందువుల శ్మశానవాటికను ఆనుకుని సర్వే నంబర్ 45/10లో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించారు. ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


