ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

విజయనగరం టౌన్‌: విజయనగరం రూరల్‌ మండలంలో ని జొన్నవలస గ్రామానికి చెందిన దొంతల జగదీష్‌ (30) మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జగదీష్‌కు అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. వారికి ఓ పాప కూడా ఉంది. చిన్నపాటి కూలిపని చేసుకుంటూ జీవనం సాగించే జగదీష్‌కు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఆ అమ్మాయి తనను పెళ్లిచేసుకోవాలని కోరుతూ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు. 53 రోజులు జైలుశిక్ష అనుభవించిన తర్వాత తిరిగి తన భార్యా,బిడ్డను చూసేందుకు వెళ్లాడు. పెద్దల సమక్షంలో అన్నీ తేలిన తర్వాతనే వస్తానని భార్య చెప్పడంతో మనస్తాపం చెందిన జగదీష్‌ తన ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై వెలమల ప్రసాదరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement