విజయనగరం: పారా స్విమ్మింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల విజయవాడ గాంధీనగర్‌లోని సర్ విజ్జి మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8 వ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్ –2026 లో జిల్లాకు చెందిన హేమవతి 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, జాగారణ సత్యనారాయణ 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ విభాగంలో సిల్వర్ మెడల్, ఫ్రీ స్టైల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. జాతీయ పోటీలకు ఎంపికై న వారి వివరాలు త్వరలో ప్రకటిస్తారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులను ఆయన అభినందించారు.


