అర్జీ వస్తే.. పరిష్కారం కావాల్సిందే | - | Sakshi
Sakshi News home page

అర్జీ వస్తే.. పరిష్కారం కావాల్సిందే

Oct 6 2026 1:24 AM | Updated on Oct 6 2026 1:24 AM

● డీఆర్‌ఓ సత్తిబాబు

● పీజీఆర్‌ఎస్‌కు 220 వినతులు

విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యం అని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌.సత్తిబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహంచిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి 220 వినతులు స్వీకరించారు. వాటిలో 102 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రజలు తమ సమస్యలను డీఆర్‌ఓ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాలు, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అర్జీదారుతో మాట్లాడిన అనంతరం మాత్రమే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. పరిష్కరించిన వివరాలను ఫిర్యాదుదారులకు తెలియాజేయాలని సూచించారు. 1100 టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

శాఖల పరంగా..వినతులు

రెవెన్యూ–102, పంచాయతీరాజ్‌–31, డీఆర్‌డీఏ–9, విద్యుత్‌–4, గృహ నిర్మాణం–1, గ్రామ సచివాలయం–7, విద్య–10, మున్సిపల్‌–12, డీఎంహెచ్‌వో–6, ఇతర శాఖలు–38 చొప్పున వినతులు నమోదయ్యాయి.

ప్రధాన సమస్యలపై డీఆర్వో ఆదేశాలు

ముడిదాం,కొత్తవలస ప్రాంతాల్లో భూకబ్జాలు, డెంకాడ మండలం పేడాడలో 1–బి బదిలీ, జామి మండలం గొడికొమ్ము పరిధిలోని భూమి బైండోవర్‌ కేసుల పరిష్కారానికి సంబంధించి వచ్చిన అర్జీలను మండల తహసీల్దార్లు స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పీవీజీ నగర్‌కు చెందిన పి.సూర్యారావు వికలాంగ తిచక్ర మోటరైజ్డ్‌ వాహనం వినతిని విభిన్న ప్రతిభావంతుల శాఖకు, రేగిడి ఆముదాలవలస మండలం పూర్లికి చెందిన జి.లక్ష్మి వితంతు పింఛన్‌ అర్జీని డీఆర్‌డీఏకు బదిలీ చేశారు. కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి ఈ.మురళి, జిల్లా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు అరుణకుమారి, వెంకటరెడ్డి, ఆర్డీవోలు సుధారాణి, సుధాసాగర్‌, జగన్నాథరావు, సీపీవో బాలజీ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్‌ పీడీ మురళీమోహన్‌, జిల్లా భూ సర్వే రికార్డ్స్‌ శాఖ సహాయ సంచాలకుడు ఆర్‌.విజయ్‌కుమార్‌, డీపీవో మల్లికార్జున్‌,వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఏవో దేవీప్రసాద్‌, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

విజయనగరం టౌన్‌: సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి 37 ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 19, కుటుంబ కలహాలకు సంబంధించి ఐదు, మోసాలకు పాల్పడినట్లు 10, ఇతర అంశాలకు సంబంధించి మూడు ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలపై చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement