24 నుంచి క్రెడయ్‌ హోమ్‌ ఎక్స్‌పో–2026 | - | Sakshi
Sakshi News home page

24 నుంచి క్రెడయ్‌ హోమ్‌ ఎక్స్‌పో–2026

Oct 6 2026 1:24 AM | Updated on Oct 6 2026 1:24 AM

● క్రెడయ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కె.సుభాష్‌ చంద్రబోష్‌

విజయనగరం: క్రెడయ్‌ విజయనగరం చాప్టర్‌ ఆధ్వర్యంలో విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండగ సమయంలో ఈ నెల 24,25 26 తేదీలలో మూడు రోజుల పాటు ‘హోమ్‌ ఎక్స్‌పో–2026’ నిర్వహిస్తున్నామని క్రెడయ్‌ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎస్‌.సి.బోస్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని ప్రైవేట్‌ హోటల్లో క్రెడయ్‌ హోమ్‌ ఎక్స్‌పో బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుభాష్‌చంద్రబోష్‌ మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రజలకు ఇల్లు కొనుగోలు చేయడం, నిర్మించడం, ఆధునికీకరించడం, అందంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన అన్ని అవకాశాలను ఒకే వేదికపై అందించేందుకు క్రెడయ్‌ హోమ్‌ ఎక్స్‌పో ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ హోమ్‌ ఎక్స్‌పోలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలతో పాటు బ్యాంకులు, హోమ్‌ లోన్‌ సంస్థలు, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, సిమెంట్‌, స్టీల్‌, టైల్స్‌, శానిటరీ, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, ఇంటీరియర్స్‌, ఫర్నిచర్‌, కిచెన్స్‌, హోమ్‌ డెకర్‌, సెక్యూరిటీ సొల్యూషన్స్‌, గృహ నిర్మాణానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులు, సేవల సంస్థలు పాల్గొననున్నాయని వివరించారు.

ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు, సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు, నిర్మాణంలో ఉన్న వారు లేదా తమ ఇంటిని ఆధునికీకరించుకోవాలనుకునే వారికి ఇల్లు నిర్మించడం నుంచి ఇంటీరియర్స్‌ వరకు అవసరమైన పూర్తి సమాచారం, ఉత్పత్తులు, సేవలు, ఆర్థిక అవకాశాలను ఒకే వేదికపై తెలుసుకునే అవకాశం ఈ ఎక్స్‌పో ద్వారా లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా వివిధ రకాల హోమ్‌ లోన్‌, ఫైనాన్స్‌ సదుపాయాలు, నూతన నిర్మాణ పద్ధతులు, ఆధునిక బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ఇంటీరియర్‌ డిజైన్‌ ట్రెండ్స్‌, ఫర్నిచర్‌, హోమ్‌ డెకర్‌ వంటి అంశాలను ప్రజలు ప్రత్యక్షంగా పరిశీలించి, తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ప్రజలకు రియల్‌ ఎస్టేట్‌, గృహ నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రజలు–డెవలపర్లు–బ్యాంకులు–నిర్మాణ రంగ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ హోమ్‌ ఎక్స్‌పో ప్రధాన లక్ష్యమని తెలిపారు.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలందరూ కుటుంబ సమేతంగా హోమ్‌ ఎక్స్‌పోను సందర్శించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రెడయ్‌ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎస్‌సీ బోస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్రెడయ్‌ విజయనగరం చాప్టర్‌ చైర్మన్‌ సీహెచ్‌.సూర్యనారాయణరాజు, అధ్యక్షుడు కె.రాజశేఖర్‌, కార్యదర్శి సురేంద్ర అశ్వంత్‌, సలహాదారు చెరుకూరి శ్రీధర్‌, పూర్వపు చైర్మన్‌ వి.పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement