రాజాం: ఈనెల 9 నుంచి కాకినాడలో జరగనున్న స్కూల్ గేమ్స్‌ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు రాజాం మండలంలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.కార్తీక్ ఎంపికయ్యాడు. ఈనెల 4న శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఆ విద్యార్థి అండర్ –17 విభాగంలో 71 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తాలాడ దుర్గయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా పీడీ దుర్గయ్య, పీఈటీ బీఎన్ నాయుడులతో పాటు పాఠశాల హెచ్‌ఎం వై.గౌరునాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్‌మోహన్, లెంక శ్రీనివాసరావు, పి.వేణుగోపాల్, ఎం. గౌరీశంకర్, బి.మహేష్‌లు విద్యార్థి కార్తీక్‌ను అభినందించారు.
కళాకారులను ఆదుకోండి
విజయనగరం క్రైమ్: కళాకారులకు రూ.10 వేల పెన్షన్ ఇచ్చి, ఆదుకోవాలని ఏపీ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు తామాడ రాము డిమాండ్ చేశారు. ఇదే విషయమై కళాకారులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసనకు దిగారు. ఐదేళ్లు పాలించిన ప్రజాప్రతినిధులకు నెలనెలా పెన్షన్ ఇస్తున్నారు కానీ కళారంగాన్ని బతికిస్తున్న కళాకారులను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా కళాకారులకు గుర్తింపుకార్డులు మంజూరు చేసి, పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బుగత అశోక్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
గుర్ల: మండలంలోని పెద్దబంటుపల్లిలో సర్వే నంబర్ 2–1. 2–2లో ఉన్న రెండు ఎకరాల 52 సెంట్ల భూమి అక్రమణకు గురవుతోందని సాక్షి ఈనెల5న సోమవారం ‘దర్జాగా కబ్జా’ అనే శీర్షికతో ప్రచురించింది. దీనికి రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమణ స్థలంలో హెచ్చరిక బోర్డును సోమవారం ఏర్పా టు చేశారు. బోర్డును తొలగిస్తే చర్యలు తీసుకుంటామని అక్రమణదారులను ఆర్‌ఐ అప్పలరాజు, వీఆర్వో దేముడమ్మ హెచ్చరించారు.
సచివాలయం ఉద్యోగిని భర్త అదృశ్యం
రాజాం సిటీ: మండల పరిధి సోపేరు గ్రామానికి చెందిన తన భర్త మామిడి రవికుమార్ కనిపించడంలేదని భార్య కుంపిల్లి చాందిని సో మవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై సల్మాన్‌బేగ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస సచివాలయంలో చాందిని వ్యవసాయ సహాయకురాలి గా పనిచేస్తోంది. ఎప్పటిలాగానే ఈ నెల 1న విధులకు హాజరైన ఆమె సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి తన భర్త కనిపించలేదు. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన రవికుమార్ ఫోన్ స్విచాఫ్ రావడంతో అన్ని చోట్ల వెతి కినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


