● మూడు కోళ్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
మెంటాడ: మండలంలోని ఉద్దంగి పంచాయతీ పరి ధి పొరంలోవలో కోడి పందాలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆండ్ర ఎస్సై కె.సీతా రాం తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కోడి పందా లు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నా రు. వారి నుంచి మూడు కోళ్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం పట్టుబడిన వ్యక్తులపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. కోడి పందాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


