చిత్రంలో కూలింగ్ క్యాప్‌ను చూపిస్తున్నది గరివిడి కేజీబీవీ బాలికలు. 2024 సంవత్సరం నుంచి పాఠశాలలో చెప్పిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) తరగతుల్లో నేర్చుకున్న అంశాలతో కూలింగ్ క్యాప్‌ల తయారీ ప్రాజెక్టును రూపొందించారు. రెండు బ్యాటరీలను క్యాప్‌లో అమర్చారు. ఒకసారి చార్జ్ చేస్తే 8 గంటలు పనిచేస్తాయి. ఈ క్యాప్‌లు తలకు పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి, ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని బాలికలు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాజెక్టును గత నెల 24, 25, 26 తేదీల్లో విశాఖలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనల్లో ప్రదర్శించారు. ఇది న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. బెంగళూరులో నిర్వహించనున్న ఏఐ సంబంధిత ప్రాజెక్టుల ప్రదర్శనకు ఎంపికై ంది. కూలింగ్ క్యాప్‌లను రూపొందించిన బాలికలను విద్యాలయ ప్రత్యేకాధికారి ఇ.ధనలక్ష్మి అభినందించారు. – చీపురుపల్లి రూరల్ (గరివిడి)


