చికెన్
బొబ్బిలి: బాడంగి మండలం వీరసాగరంలో మంగళవారం జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై బుధవారం రూరల్ సీఐ ఎస్ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరసాగరం గ్రామానికి చెందిన జాగరాన శంకర రావు, సుజాతలు మంగళవారం మధ్యాహ్నం పొలం పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సుజాత ఆడపడుచు దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన మరడ వసంత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శంకరావు, సుజాతల ఇంటిలో చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారు వస్తువులను చోరీ చేసి వెళ్లిపోయింది. శంకర రావు, సుజాతలు ఇంటికి వచ్చి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి బంగారు వస్తువులను వెతికి చూడగా లేకపోవడంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎవరెవరు ఆ సమయంలో వారి ఇంటిపరిసరాల్లో సంచరించారన్న విషయం తెలుసుకున్న తరువాత మరడ వసంతపై అనుమానం వచ్చి ఆ గ్రామంలోకి వెళ్లి విచారణ చేయడానికి ముందు అక్కడి జంక్షన్‌లో ఆమెను పట్టుకుని తనిఖీ చేయగా ఆమె వద్ద ఫిర్యాదు దారు వివరాల ప్రకారం అన్ని బంగారు వస్తువులూ దొరకడంతో అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సమావేశంలో బాడంగి ఎస్సై సూర్యకుమారి ఉన్నారు.


