ఎరువు ధర బరువైనా కరువే..! | - | Sakshi
Sakshi News home page

ఎరువు ధర బరువైనా కరువే..!

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

సాలూరు రూరల్‌: ఎరువుల ధరలు గత ఏడాది కంటే ఈ ఏడాది పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువు కావాలంటే ఆన్‌లైన్‌లో ఆధార్‌కార్డు నమోదు చేసుకుని తీసుకునే పద్ధతితో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పనులు చేసుకోవాల్సిన సమయంలో ఎరువులకోసం పడిగాపులు కాయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సాలూరు మండల రైతులు ఎరువు కోసం ఉదయం 6 గంటలనుంచి గ్రోమోర్‌ సెంటర్‌ వద్ద పడిగాపులు పడ్డారు. అయితే షాపు 8 గంటలకు తెరవడం, అలాగే కొంత సమయం ఆన్‌లైన్‌ పనిచేయకపోవడంతో రైతులు విసిగిపోయారు. ఎట్టకేలకు పరిమితంగా యూరియా, డీఏపీ ఇవ్వడంతో రైతులు నిరుత్సాహంగా వెనుదిరిగారు. ఇలా చాలీ చాలని ఎరువులతో పంటలు ఎలా పండించగలమని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ధరలతో భారం

గతంలో ఉన్న ధరలకంటే ఈ ఏడాది ఎరువుల ధరలు దాదాపు సగానికి పైగా పెరిగిపోయాయి. అమోనియా గత ఏడాది రూ.700 నుంచి రూ.800 ఉంటే ఈ ఏడాది రూ.1200 నుంచి రూ.1400 వరకు అమ్ముతున్నారు. అలాగే రెడ్‌ పొటాష్‌ గత ఏడాది రూ.1400 ఉండగా ప్రస్తుతం రూ.2,200కు అమ్ముతున్నారు. అయినా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులను ఈ ప్రభుత్వం ఉసూరుమనిపిస్తోందని వాపోతున్నారు.

రైతులపై ప్రభుత్వం చిన్నచూపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement