అక్టోబర్ వరకు ఇక్కడ కనువిందు
బొండపల్లి: ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం కాని దేశం నుంచి పక్షులు మండలానికి వచ్చేశాయి. కొన్నేళ్లుగా సైబీరియా దేశం నుంచి పక్షులు మే నెల ప్రారంభంలోనే వచ్చి సందడి చేస్తుంటాయి. మండల కేంద్రంలోని రాజు చెరువులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహర వేటలో ఉండే ఈ పక్షులు రాత్రి కాగానే గజపతినగరం మండలం లోగిశ గ్రామంలోని చింతచెట్ల పైకి చేరుకుని సేద తీరుతాయి. ఈ పక్షులు రావడాన్ని ఇటు బొండపల్లి, అటు లోగిశ ప్రజలు శుభసూచికంగా భావిస్తారు. ఇక్కడకు వచ్చిన పక్షులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసిన తర్వాత అక్టోబర్ సమయంలో తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడి ప్రజలు పక్షులకు ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా నడుచుకోవడం విశేషం.
చేయనున్న సైబీరియా పక్షులు


