ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం మహారాజా కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రక్తదాన శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు ప్రారంభించారు. ‘ఒక రక్తదానం అనేక ప్రాణాల రక్షణ’ అనే సందేశంలో నిర్వహించిన శిబిరంలో 65 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఐఆర్‌సీఎస్ చైర్మన్ కేఆర్‌డీ ప్రసాద్, మహారాజా బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేటర్ అప్పలనాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ జి.చంద్రశేఖరరావు, ప్రొగ్రాం అధికారులు డాక్టర్ పీఎన్‌బీశర్మ, డాక్టర్ ఎస్.వై.విష్ణు, సీహెచ్ చిన్నంనాయుడు, చిరంజీవి, ఎన్‌సీసీ అధికారులు మేజర్ ఎ.కళ్యాణ్‌అశోక్, లెఫ్టినెంట్ బి.ఝాన్సీ, స్టూడెంట్ విభాగం కన్వీనర్ వి.బాబ్జి, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం అర్బన్


