యుద్ధం వద్దు.. శాంతి ముద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ చీపురుపల్లి, గరివిడి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీపురుపల్లి పట్టణంలో మంగళవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచంపై డాలర్ ఆదిపత్యం తగ్గుతుందన్న భయంతో అమెరికా ప్రపంచ దేశాలపై దాడులకు తెగబడుతుందని విమర్శించారు. వెనిజులా దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి ఆదేశ సుప్రీం లీడర్‌ను హతమార్చడం తగదన్నారు. ఇరాన్‌లోని పాఠశాలపై బాంబు దాడి కారణంగా 170 మంది పసి పిల్లలు మరణానికి అమెరికా బాధ్యతవహించాలన్నారు. ప్రస్తుతం క్యూబా దేశంలో ఆర్థిక ఆంక్షలు పెడుతోందని, దీనిని ప్రజా సంఘాల తరఫున ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ, ఏపీజీవీఏ, ఏపీజేఏసీ, ఎస్‌ఎఫ్‌ఐతో పాటుగా పలువురు పాల్గొన్నారు. – చీపురుపల్లి


