విజయనగరం ఫోర్ట్: స్థానిక స్వామి గ్యాస్ ఏజెన్సీని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్ట్రర్‌ను పరిశీలించి అందుబాటులో ఉన్న సిలిండర్లను భౌతికంగా సరిచూశారు. గత నెల 2 నుంచి 9వ తేదీవరకు కొన్ని కారణాల వల్ల డీలర్ షాపు తెరవకపోవడం వల్ల సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్టు జేసీ గుర్తించారు. సమస్య పునరావృతం కాకుండా చూడాలని పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి అదనపు గ్యాస్ సిలిండర్లు తక్షణం అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన నిధులను చెల్లించాలని డీలర్‌ను ఆదేశించారు. గ్యాస్ కోసం వినియోగదారుడు ఏజెన్సీకి రాకుండా ప్రతి వినియోగదారుడి ఇంటికి డోర్ డెలివరీ వ్యవస్థను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ తనిఖీలో సీఎస్‌డీటీ రామరావు పాల్గొన్నారు.


