కర్షకులు.. దివ్యాంగులు.. వృద్ధులు.. పల్లె/పట్టణ ప్రజలు కలెక్టరేట్‌ వేదికగా సోమవారం తమ సమస్యలు వినిపించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలిపారు. హామీల అమలులో సీఎం చంద్రబాబు మోసపూరిత విధానాన్ని ఎత్తిచూపారు. కలెక్టర్‌కు వినతులు అందజేశారు | - | Sakshi
Sakshi News home page

కర్షకులు.. దివ్యాంగులు.. వృద్ధులు.. పల్లె/పట్టణ ప్రజలు కలెక్టరేట్‌ వేదికగా సోమవారం తమ సమస్యలు వినిపించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలిపారు. హామీల అమలులో సీఎం చంద్రబాబు మోసపూరిత విధానాన్ని ఎత్తిచూపారు. కలెక్టర్‌కు వినతులు అందజేశారు

Mar 24 2026 6:51 AM | Updated on Mar 24 2026 6:51 AM

● ప్రభుత్వం మొక్కజొన్న క్వింటా మద్దతు ధర రూ.2,400 ప్రకటించింది... ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.. చేతికొచ్చిన పంటను క్వింటా రూ.1600 నుంచి రూ.1700లకే దళారులకు విక్రయించాల్సి వస్తోంది.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణతో కలిసి రైతులు కలెక్టరేట్‌ గేటు వద్ద ధర్నా చేశారు. మొక్కజొన్న రైతుల కష్టాలను పాలకులు కళ్లుతెరచి చూడాలన్నారు. రైతులు నష్టపోతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు, రాములు, గోపాలం, బాలి హరి, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

● దేవుపల్లి గ్రామం మీదుగా జాతీయ రహదారి వరకు ఉన్న మార్గాన్ని డీ–పట్టా భూమి యజమాని మూసివేశారు.. ఇప్పుడు గ్రామానికి దారి కరువైంది... తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని ‘మార్గం’ చూపాలంటూ బొండపల్లి మండలంలోని గొల్లుపాలెం పంచాయతీ పరిధిలోని చినగూడెం గ్రామస్తులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డికి తమ గోడు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement