అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు | - | Sakshi
Sakshi News home page

అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు

Mar 24 2026 6:51 AM | Updated on Mar 24 2026 6:51 AM

గజపతినగరం: కార్యాలయంలో రికార్డులు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని, అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎకై ్స జ్‌శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాసచౌదరి అన్నారు. గజపతినగరం ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సోమవారం సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం మద్యం షాపుల యజమానులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎకై ్సజ్‌ సీఐ జె.జనార్దనరావు, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ టీచర్లకు శిక్షణ

విజయనగరం అర్బన్‌: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌పై ఉపాధ్యాయులకు విజయనగరం కంటోన్మెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహిస్తామని స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు ఆదేశాల మేరకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చరిత్ర, నియమ నిబంధనలు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిగే ప్రయోజనాలు, యూనిట్‌ నిర్వహణ విధానం, పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు హాజరుకావచ్చన్నారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.381, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.211 రిజిస్ట్రేషన్‌ ఫీజు ఉంటుందని, పూర్తి వివరాల కోసం సెల్‌: 94409 12863 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

తగ్గిన మడ్డువలస నీటినిల్వ

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 65 మీటర్లు కాగా, ప్రస్తుతం 62.70 మీటర్ల మేర నిల్వ ఉంది. కనిష్టంగా 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 372 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతుండగా, కుడి ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు 550 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 20 రోజుల్లో ప్రాజెక్టు వద్ద డెడ్‌ స్టోరేజీ నమోదు కావచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement