నిర్లక్ష్యయం వద్దు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యయం వద్దు

Mar 24 2026 6:51 AM | Updated on Mar 24 2026 6:51 AM

నేడు ప్రపంచ క్షయ నివారణ దినం

క్షయ వ్యాధి రోగులకు

మద్దతుగా నిలవాలి

క్షయవ్యాధి నిర్ధారణ అయిన రోగులు మందులు క్రమబద్ధంగా ఆరు నెలల పాటు వాడేలా కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలి. అంటరానివారిగా చూడకూడదు. మందులు వాడితే తగ్గిపోయే వ్యాధి కాబట్టి తరచూ దగ్గువస్తే అశ్రద్ధ చేయకుండా క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

– డాక్టర్‌ బొత్స సంతోష్‌కుమార్‌, పలమనాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

వ్యాధి నివారణకు కృషి

క్షయవ్యాధి నివారణకు కృషి చేస్తున్నాం. కఫం పరీక్ష కేంద్రాల్లో ఎక్కువ మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్షయ రోగి కుటుంబ సభ్యులకు కూడా కఫం పరీక్ష చేస్తున్నాం. క్షయ రోగులకు హెచ్‌ఐవీ పరీక్షలు, హెచ్‌ఐవీ రోగులకు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం.

– డాక్టర్‌ కె.రాణి, జిల్లా క్షయ నివారణ అధికారి

క్షయ వ్యాధి లక్షణాలు ఇలా..

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం

ఆకలి మందగించడం, బరువు తగ్గడం

ఛాతిలో నొప్పి, మూత్రంలో రక్తం, నిరంతరం తలనొప్పి

కఫంలో రక్తం పడడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది

మెడలో వాపు, మెడ దగ్గర గడ్డలు

కడుపులో నిరంతరం నొప్పి

వ్యాధి సోకే అవకాశం వీరికి ఎక్కువ..

హెచ్‌ఐవీ, కేన్సర్‌ రోగులకు

మధుమేహాం ఉన్న వారికి

డయాలసిస్‌ రోగులకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement