ముచ్చర్లవలసలో అతిసారం
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస గ్రామంలో అతిసార వ్వాధి విజృంభించింది. దీంతో సుమారు 15 మందికి పైగా డయేరియా సోకడంతో వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఒకరిద్దరు విజయనగరం, కొంతమంది బాడంగి సీహెచ్‌సీ, మరికొంతమంది రామభద్రపురం క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.
పసుకుడి వద్ద లారీ బోల్తా
● నెలలో మూడో ప్రమాదం
భామిని: మండలంలోని కొత్త పసుకుడి వద్ద గల రోడ్డు డైవర్షన్‌లో బుధవారం వేకువ జామున భారీ లోడు లారీ తిరగబండింది. గడిచిన నెలరోజుల్లో ముచ్చటగా మూడో రోడ్డు ప్రమాదం ఇదే డైవర్షన్‌లో జరగడం ఆశ్యర్యం కలిగిస్తోంది. స్థానిక అధికారులు రోడ్డు ప్రమాదాలపై చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న భారీ లారీలు ఈ రోడ్డులో ప్రమాదానికి గురయ్యాయి.
ముచ్చర్లవలసలో అతిసారం


