ఇద్దరు విద్యార్థులకు ఇస్రో శాస్త్రవేత్తలను కలిసే అవకాశం
విజయనగరం అర్బన్: జిల్లా నుంచి ఎంపికై న ఇద్దరు విద్యార్థులకు నాసా, ఇస్రో శాస్త్రవేత్తలను కలిసే అద్భుత అవకాశం వచ్చిందని, వారికది మరపురాని అనుభూతిని పొందడమేనని డీఈఓ యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. సైన్స్ ఈవెంట్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ ప్రత్యేక సైన్స్ టూర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. విమానంలో వెళ్లి ఢిల్లీ వంటి ప్రదేశాల్లో అధునాతన సైన్స్ సెంటర్‌లు, ప్లానిటోరియంలు, ఇండో–రష్యన్ సెంటర్‌లను సందర్శించే అవకాశం జిల్లాలోని డెంకాడ మండలం అక్కివరం విద్యార్థి పతివాడ భానుప్రసాద్, వియ్యంపేట డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ గురుకులం విద్యార్ధిని తెగ్లంగి సంజనకు లభించిందని డీఈఓ తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తరగతి వరకు జరిగే ఈ ప్రత్యేక టూర్‌లో పాల్గొనడానికి బుధవారం వారిద్దరూ ప్రయాణమయ్యారు.


