ఎంపీడీఓ, సిబ్బందిపై కలెక్టర్ అసహనం
పూసపాటిరేగ: పూసపాటిరేగ ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఎస్. రామ్‌సుందరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పూసపాటిరేగ మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ పరిశీలించి సిబ్బంది ఒకరు మాత్రమే ఉండడంతో సిబ్బంది ఏరని? అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. ఎంపీడీఓ, సూపరింటెండెంట్‌లు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆన్‌లైన్ సేవలపై డిప్యూటి తహసీల్దార్ సంజీవ్‌కుమార్‌ను అడిగారు. నిర్ణీత సమయంలో సేవలు అందించాలని ఆదేశించారు. దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహ భరిత వాతావరణంలో సాగాయి. జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14,17 వయస్సుల విభాగాల్లో బాలబాలిలకు కబడ్డీ, ఖోఖో క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా..అండర్–17 విభాగంలో బాల,బాలికలకు అథ్లెటిక్స్ క్రీడాంశంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి పంపించనున్నట్లు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు తెలిపారు. ఎంపిక పోటీలను జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.
బొబ్బిలిరూరల్: మండలంలోని పిరిడి గ్రామంలో పండాల శ్రీశాంకరిపీఠం, గణేష్ జ్ఞాన మందిరంలో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. గుడి నిర్వాహకులు తెలిపిన సమాచారం మేరకు కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజల కోసం బుధవారం గుడిని తెరిచి పూజలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో తామంతా గుడి నుంచి బయటకు వచ్చేశామని ఆలయ నిర్వాహకురాలు నీరజ చెప్పారు. ప్రతి ఏడాదీ ఆలయ ధర్మకర్తలు పండాల చినబాబు, బంధువులు కార్తీక పౌర్ణమికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని ఇంతలో ఈ దొంగతనం జరగిందని నిర్వాహకురాలు నీరజ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఈ నెల 17,18,19 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న టేబుల్‌టెన్నిస్ రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక ఈనెల 9వ తేదీన గరివిడిలో గల శ్రీ చైతన్యస్కూల్‌లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా సెక్రటరీ పి.కృష్ణమూర్తి తెలిపారు. అండర్–11,13,15,17,19 సంవత్సరాల బాలబాలికలు, సీనియర్స్ సీ్త్ర పురుషుల ఎంపికలు జరుగుతాయని తెలిపారు. టీమ్ ఈవెంట్ విభాగంలో అండర్–15 బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో ఎంపికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికలకు హాజర య్యే వారు ఉదయం 9గంటలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఫోన్ 94411 41122 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఎంపీడీఓ, సిబ్బందిపై కలెక్టర్ అసహనం
ఎంపీడీఓ, సిబ్బందిపై కలెక్టర్ అసహనం


