
హాస్టల్ విద్యార్థుల నిరసన
విజయనగరం టౌన్: విజయనగరం బీసీ కాలనీలో ఉన్న పోస్టుమెట్రిక్ బాయ్స్ ట్రైబల్ హాస్టల్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పీడీఎస్‌ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు కె.సోమేశ్వరరావు మాట్లాడుతూ హాస్టల్ ప్రాంగణంలో నిల్వ ఉన్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు.
మంచినీటిని కిలోమీటరు దూరంలోని వాటర్‌ప్లాంట్ నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందన్నారు. తక్షణమే హాస్టల్‌లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్ల తలుపులు బాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌ఓ సభ్యులు వినయ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్ విద్యార్థుల నిరసన