
ఒక ఉపాధ్యాయుడు.. ఒక విద్యార్థి
చిత్రంలో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు ఉన్నది వేపాడ మండలం వావిలపాడు పంచాయతీ కడకొండ గిరిజన గ్రామ ప్రాథమిక పాఠశాల. 40 కుటుంబాలు, 175 మంది జనాభా కలిగిన గ్రామంలో బడిఈడు పిల్లలు లేరు. చాలా కుటుంబాలు వలస వెళ్లిపోవడం, గతేడాది ఐదో తరగతి చదివిన నలుగురు విద్యార్థులు ఈ ఏడాది ఆరో తరగతిలో చేరడంతో పాఠశాలను మూసివేయాల్సిన పరిస్థితి. అయితే, అంగన్‌వాడీ కేంద్రం నుంచి మోక్షజ్ఞ అనే చిన్నారి ఒకటో తరగతిలో చేరడంతో బోధన కోసం డిప్యూటేషన్‌పై సోంపురం క్లస్టర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కె.నవీన్‌ను ఈ నెల 07న నియమించారు. ఆ ఒక్క చిన్నారి చేరడంతో పాఠశాల మూతపడలేదని ఎంఈఓ బాలభాస్కరరావు తెలిపారు. – వేపాడ