
● రాములోరి చెంత ప్రకృతి పులకింత
విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపైకి ఎక్కేవారికి ప్రకృతి అందాలు మైమరిపిస్తాయి. ఓ వైపు దట్టమైన పొదలతో కూడిన కొండలు... మరోవైపు కనుచూపు మేర పచ్చని పొలాలు.. పుడమికి పచ్చబొట్టు పెట్టేలా ఉభాలకు సిద్ధంగా ఉన్న నారుమడులు.. పొలాల మధ్యగుండా సన్నని రేఖలా కనిపించే దారులు కొత్త అనుభూతిని పంచుతాయి. ఆహ్లాదాన్ని, అనందాన్ని కలిగిస్తాయి. మనసును హత్తుకుంటాయి. రాములోరి సాక్షిగా కనిపించే ప్రకృతి సోయగాలకు శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే సాక్ష్యం.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం