
శ్రావణ శోభ
విజయనగరం టౌన్: శ్రావణమాసం తొలి శుక్రవారం భక్తులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. ఆలయాలను దర్శించారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పసుపుకుంకుమలు సమర్పించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. చదురుగుడి, వనంగుడిలో కొలువైన అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా పుష్పశోభితమైంది. వాసవీ కన్యకపరమేశ్వరి శాకంబరిగా దర్శనమిచ్చారు. మయూరీ కూడలి వద్దనున్న సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి విశిష్ట కుంకుమార్చనలు జరిపారు. శ్రీక్షేత్రంలో కొలువైన అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వెంకటేశ్వరస్వామిదేవాలయంలో పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

శ్రావణ శోభ

శ్రావణ శోభ