
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
● అధికారులంతా
అప్రమత్తంగా
ఉండాలి
● ఇన్‌చార్జి కలెక్టర్
సేతు మాధవన్
విజయనగరం అర్బన్: రానున్న 24 గంటల్లో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితుల్ని అంచనా వేయాలని, ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. జలాశయాల్లో నీటినిల్వలపై కలెక్టరేట్ డి–సెక్షన్‌కు నివేదికలు అందజేయాలని జలవనరులశాఖ అధికారులకు సూచించారు.
మంచి గుడ్లు సరఫరాకు ఆదేశం
బొబ్బిలి: స్థానిక మున్సిపాలిటీ, బొబ్బిలి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నభోజనంలో వడ్డించేందుకు కుళ్లిన గుడ్లు సరఫరా చేశారు. ఇదే అంశంపై ఈ నెల 24న ‘కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కుళ్లిన గుడ్లు స్థానంలో మంచి గుడ్లు సరఫరా చేసినట్టు ఎంఈఓ గొట్టాపు వాసు శుక్రవారం తెలిపారు. జయప్రకాష్ పాఠశాలలో కుళ్లిన 34 గుడ్లను రీప్లేస్ చేయించామన్నారు. కుళ్లిన గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చామన్నారు. పలు పాఠశాలల హెచ్‌ఎంలు, నిర్వాహకులు తెలిపిన సమాచారం మేరకు మంచి గుడ్లను అందించామన్నారు.

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు