వైద్య విద్యార్థుల ఇంటింటి సర్వే | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థుల ఇంటింటి సర్వే

Published Sun, Nov 12 2023 12:28 AM

మాట్లాడుతున్న  శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి విజయకుమార్‌ 
 - Sakshi

బొండపల్లి: మండలంలోని గొట్లాం పంచాయతీ పరిధిలోని గొట్లాం, జియ్యన్నవలస, బారిక పాలెం, రెడ్డిపేట గ్రామాల్లో విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు శనివారం ఇంటింటి సర్వే చేశారు. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. వైద్య విద్యార్థులు 150 మంది గ్రామంలోని 750 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ప్రతినెలా వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని ఉచిత వైద్యసేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి వైద్య విద్యార్థి ఐదు కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని కావాల్సిన వైద్యసేవలు అందిస్తున్నారు. సర్వేకు వైస్‌ ఎంపీపీ మీసాల సరోజిని, పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీ చైర్మన్‌ మహంతి రమణ, వైఎస్సార్‌సీపీ నాయకులు మీసాల తులసీరాం, గ్రామ సర్పంచ్‌ సహకరించారు.

ప్రమాదరహిత డ్రైవింగ్‌ నైపుణ్యాలు అవసరం

ఆర్టీసీ డీపీఈఓ విజయకుమార్‌

విజయనగరం అర్బన్‌: ఆర్టీసీ రవాణా సేవల్లో డ్రైవింగ్‌ నైపుణ్యాలు ప్రమాద రహితంగా ఉండాని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి విజయకుమార్‌ అన్నారు. ఆర్టీసీ శిక్షణ కళాశాలలో 15 రోజులుగా డ్రైవర్లకు నిర్వహించిన శిక్షణతరగతుల ముగింపు కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. డిప్యూటీ సీఎంఈ కొటాన శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 600 మంది డ్రైవర్లకు రోజుకు 40 మంది చొప్పున ప్రమాద రహిత డ్రైవింగ్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు, రీజనల్‌ సేఫ్టీ మెకానికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సీహెచ్‌.వేణు తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే భవిష్యత్తు

విజయనగరం అర్బన్‌: చదువుతోనే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శ్రీకుమార్‌ పిలుపునిచ్చా రు. విజయనగరం పట్టణంలోని గాజులరేగ సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవంలో ఆయన మాట్లా డారు. విద్య ప్రాధాన్యతను వివరించారు. ప్రాథమిక హక్కుగా ఉన్న విద్యను అభ్యసించి భావితరాలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పో టీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్‌ డి.వి.రామమూర్తి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకట లక్ష్మి, గ్రంథాలయాధికారి లెంక సత్యవతి పాల్గొన్నారు.

1/2

గొట్లాంలో ఇంటింటి వైద్యసర్వే చేస్తున్న 
విజయనగరం మెడికల్‌ కళాశాల విద్యార్థులు
2/2

గొట్లాంలో ఇంటింటి వైద్యసర్వే చేస్తున్న విజయనగరం మెడికల్‌ కళాశాల విద్యార్థులు

Advertisement
 
Advertisement