విజయనగరం
న్యూస్‌రీల్
శ్రీనివాసునికి పుష్పయాగం
ఉత్తర ద్వారదర్శనం రేపు రామతీర్థంలో గిరిప్రదక్షిణ
10వేల మంది భక్తులు రానున్నట్లు అంచనా
ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం అధికారులు
ఏర్పాట్లు దాదాపు పూర్తి
పటిష్ట బందోబస్తు
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సర్వజన ఆస్పత్రికి వస్తున్న రోగులను ఇక్కడ సరైన సదుపాయాలు లేవని తన క్లినిక్‌కు వస్తే బాగు చేస్తానని ఓ ఫిజియోథెపిస్ట్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. –8లో
రామతీర్థం దేవస్థానం (ఇన్‌సెట్లో)
సీతారామస్వామివారి ఉత్సవ విగ్రహాలు
విజయనగరం ఫోర్ట్: కలెక్టరేట్‌లోని ఆడిటోరి యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అర్జీ దారులు తమ సమస్య గురించి కచ్చితమైన పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అధికారులందరూ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని కోరారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు 1100 ట్రోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.
రాజాం సిటీ: స్థానిక జీసీఎస్‌ఆర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు గణితంలో పీహెచ్‌డీ పట్టా లభించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆన్ డెస్క్ ఎనర్జీ కాస్మోలాజికల్ మోడల్ ఇన్ సెర్టిన్ థీరీస్ ఆఫ్ గ్రావిటేషన్ అనే పరిశోధనకు గాను గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసిందని పేర్కొన్నారు. తన ఈ పరిశోధనకు డాక్టర్ వి.గణేష్, డాక్టర్ కె.దాసునాయుడులు గైడ్స్‌గా వ్యవహరించారన్నారు. శ్రీనివాసరావుకు పీహెచ్‌సీడీ రావడం పట్ల ప్రిన్సిపాల్ పురుషోత్తం, అధ్యాపకులు అభినందించారు.
విజయనగరం టౌన్: జిల్లాకు చెందిన ధర్మాస్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ పీఎస్‌వీ.కామేశ్వరరావుకు ఉత్తమ నాట్యాచార్య పురస్కారం దక్కింది. జాతీయస్థాయి కూచిపూ డి నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ ఉపద్రష్ట ఫంక్షన్ హాల్‌లో ద్వారకాసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు దక్కినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నృత్యప్రదర్శన చేసిన చిన్నారులకు ఉత్తమ నాట్య ప్రతిభా పురస్కారాలు అందజేశారన్నారు. మచిలీపట్నం ఎమ్మార్వో హరినాథ్ చేతుల మీదుగా తాము పురస్కారా లు అందుకున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
నేడు చదురుగుడికి పెదపోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారు సోమవారం చదురుగుడికి చేరుకోనున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 26, 27, 28 వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి జాతర తొలిఘట్టం పోలమాంబ అమ్మవారి మేనత్త పెద పోలమాంబ అమ్మవారిని చదురుగుడికి తీసుకువస్తారు. పోలమాంబ మేనత్త పె ద పోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్ని వారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తు ల కోలాహం, వాయిద్యాలు, డప్పుల మధ్య పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోనీ చదురుగుడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పెద పోలమాంబ అమ్మవారిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతా రామస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి సంబ రానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న వైకుంఠ ఏకా దశి పర్వదినం సందర్భంగా ఆలయంలో శ్రీ సీతా రామచంద్రస్వామి ఉత్తర రాజగోపురం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని వైఖాసన ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించడం దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గడిచిన ఎనిమిదేళ్ల నుంచి రామతీర్థంలోని బోడికొండ(నీలాచలం పర్వతం) చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు రామగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి ఉత్తర మార్గం గుండా స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఏటా ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తుల రాక నేపథ్యంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు స్వామివారి అన్న ప్రసాదా న్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
ఈ నెల 30న జరిగే కార్యక్రమాలు
ముక్కోటి ఏకాదశి(వైకుంఠఏకాదశి)ని పురస్కరించుకుని ఈ నెల 30న అర్చకులు ప్రత్యేక పూజా కా ర్యక్రమాలు జరిపించనున్నారు. వేకువజామున 3 గంటలకు శ్రీ స్వామివారి ఆరాధన, 4 గంటలకు తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి జరిపిస్తారు. సరిగా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారదర్శనం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉత్తర రాజ గోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పల్లకిలో ఉంచి విశేష పూజలు జరిపిస్తారు. అనంతరం అదేమార్గంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. తరువా త 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవం జరిపించి భక్తులతో ఊరేగింపుగా బోడికొండ (నీలాచలం పర్వతం) మెట్లమార్గం వద్దకు చేరుకుని మెట్లోత్సవం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్య
రామతీర్థంలో శ్రీ రామచంద్రస్వామి గిరి ప్రదక్షిణ కు ఏటా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. ఇక్క డ బోడికొండకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కొండపై స్వ యంగా శ్రీరాముడే నడయాడిన ఆనవాళ్లు, పాండవులు సంచరించే చిహ్నాలు..ఇలా ఎంతో చరిత్ర ఉండడంతో కొండ చుట్టూ పాదయాత్ర చేసేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామిజీ శ్రీనివాసనంద సరస్వతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. అప్పటి నుంచి ప్రతి ఏటా గిరిప్రదక్షిణ విజయవంతంగా కొనసాగుతోంది. రామతీర్థంలో మెట్ల మార్గం వద్ద ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ ప్రధాన ఆలయం మీదుగా సీతారామునిపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తులు నడుస్తారు. అనంతరం స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.
రామభద్రపురం:
ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడ మే లక్ష్యమని జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు అన్నారు. ఈ మేరకు రామభద్రపురం మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతోనే వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 9గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, మళ్లీ సాయంత్రం 5.15గంటల వరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది.ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది 119 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక తరగతుల విద్యార్థులు పైస్థాయికి వెళ్తున్నా అక్షరాలు, కూడికలు, తీసివేతలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారని, వారి సామర్థ్యాలు పెంచేందుకు ప్రాథమిక స్థాయి విద్యకు 75 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టామని తెలి పారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్ సన్యాసిరాజు, తదితరులు పాల్గొన్నారు.
పుష్పయాగం అలంకరణలో వేంకటేశ్వరస్వామి
విజయనగరం టౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని రింగురోడ్డులో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వామివారికి శ్రీనివాసా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా సంకీర్తనలు, గోవిందనామ భజనలు, అష్టోత్తర శతనామార్చనలతో భక్తిభావం పెంపొందింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి, తరించారు.
రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి పూజలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశాం. ఆ రోజు ఉత్తర మా ర్గం నుంచి స్వామి దర్శన భాగ్యం ఉంటుంది. వేకువజామున 5 గంటల కు ప్రత్యేక పూజలనంతరం భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. బోడికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజ అనంతరం గిరి ప్ర దక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు 10వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. అందరికీ అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం.
–వై.శ్రీనివాసరావు, ఈఓ,రామతీర్థం దేవస్థానం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తాం. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కొండ మార్గంలో, కోనేరు వద్ద, ఆలయంలో విధులు నిర్వర్తి స్తాం. క్యూల వద్ద తోపులాట జరగకుండా ముందస్తుగా చర్యలు చేపడతున్నాం. స్వామి దర్శనానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చేపడతాం. ప్రశాంతంగా ముగి సేందుకు భక్తులు కూడా సహకరించాలి.
–గణేష్, ఎస్సై, నెల్లిమర్ల మండలం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం


