పందెంరాయుళ్ల అరెస్ట్
బాడంగి: మండలంలోని పాల్తేరు శివారులో గొర్రెప్పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. ఎస్సై తారకేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్తేరు సమీపంలోని తోటలో గొర్రెప్పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం దాడి చేశారు. దీంతో ఏడుగురు పందెంరాయుళ్లు పట్టుబడగా.. వారి వద్ద నుంచి 23,160 రూపాయల నగదు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి నేపథ్యంలో ఎవ్వరైనా పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


