●మంచుబారిన పడకుండా జాగ్రత్త
ఉదయం పూట మంచు ఎక్కువగా కురుస్తున్నందున మంచుబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్నింగ్‌వాకింగ్, రన్నింగ్, గేమ్స్‌కు వెళ్లే వారు మంచు తగ్గిన తర్వాత వెళ్లడం మంచింది. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, నిమోనియా, సీఓపీడీ వంటి వ్యాధులు ఉన్న వారు చలిబారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. చల్లటి పానీయాలు, చల్లటి ఆహారం తీసుకోకూడదు, చలిలో అసలు తిరగకూడదు. చలి కాలంలో సైనసైటిస్, ఆస్తమా, నిమోనియో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. చలినుంచి రక్షణగా స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు వంటివి ధరించడం మంచిది. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినాలి.
–డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్, పలమనాజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


