స్థానికసమరానికి
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 3న నిర్వహించి, 5న ఫలితాలు ప్రకటించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీసీ జనరల్కు కేటాయించారు. జిల్లాలోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేశారు. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను సైతం ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలు, విధాన నిర్ణయాల ప్రకటనలపై ఆంక్షలు వర్తించనున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై అధికారులు నిఘా పెట్టనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నవంబర్ 3న నిర్వహించి, నవంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ నవంబర్ 26న, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ ఎన్నికలు డిసెంబర్ 2న జరగనున్నాయి.
జిల్లా జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల వివరాలు


