అక్కిరెడ్డిపాలెం: గాజువాక కై లాస్నగర్లో గంజాయి ఆయిల్ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులతో పాటు కొనుగోలు చేసిన మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. సిటీ టాస్క్ఫోర్స్ ఎస్ఐ రవికుమార్, గాజువాక పోలీసులు బుధవారం గాజువాకలో నిర్వహించిన తనిఖీల్లో ఒడిశా నుంచి గంజాయి ఆయిల్ తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి ఆయిల్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షల్లో నలుగురికీ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.


