విశాఖ సీఫుడ్‌ ప్రత్యేకత చాటేలా స్టార్‌ చెఫ్‌ చాలెంజ్‌ | - | Sakshi
Sakshi News home page

విశాఖ సీఫుడ్‌ ప్రత్యేకత చాటేలా స్టార్‌ చెఫ్‌ చాలెంజ్‌

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

మహారాణిపేట: విశాఖపట్నం తీర ప్రాంత ఆహార సంస్కృతి, స్థానిక సముద్ర ఆహార వంటకాలు, సంప్రదాయ రుచుల ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా ‘ఫ్లేవర్స్‌ ఆఫ్‌ వైజాగ్‌–స్టార్‌ చెఫ్‌ చాలెంజ్‌–2026’నిర్వహిస్తున్నట్లు జేసీ జి.విద్యాధరి అన్నారు. ఈ పోటీల రెండో ఎడిషన్‌ పోస్టర్‌ను తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. సాగర్‌నగర్‌లోని సన్‌ ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ బీచ్‌ క్యాంపస్‌లో 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం జరగనుంది. పోస్టర్‌ ఆవిష్కరణలో జిల్లా టూరిజం అధికారి జె.మాధవి, డివిజనల్‌ మేనేజర్‌ జగదీష్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, హోటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు పవన్‌ కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement