అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశాఖ నగరానికి బీసీ వర్గానికి చెందిన తనను తొలి గ్రేటర్ మహిళా మేయర్గా అవకాశం కల్పించి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా లోకానికి అత్యున్నత గౌరవం దక్కేలా చేశారు. మహిళలకు అధికారం ఇస్తే పాలన ఏ విధంగా పారదర్శకంగా ఉంటుందో తమ నాలుగేళ్ల పాలనలో చేతల్లో చేసి చూపించాం. వైఎస్ జగన్ ఆలోచనా విధానాల బాటలోనే తాజాగా కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ జీవీఎంసీ మేయర్ పదవిని మరోసారి మహిళలకు కేటాయించింది.
–గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్ (2021–2024)


