వెరీ స్మార్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వెరీ స్మార్ట్‌

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

f i t n e s s

● ఆరోగ్యం కోసం టెక్నాలజీపై భారీగా వెచ్చిస్తున్న నగరవాసులు

● నిద్ర, పరుగు, గుండె చప్పుడు.. అన్నీ డేటా మయమే

● వేలికి స్మార్ట్‌ రింగ్‌.. చేతికి స్మార్ట్‌ వాచ్‌.. తలకి బ్రెయిన్‌ యాక్టివిటీ ట్రాకర్‌

ఏయూక్యాంపస్‌: కోవిడ్‌ అనంతరం ప్రజల్లో ఆరోగ్య స్పృహ గణనీయంగా పెరిగింది. చిన్న వయసులోనే గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర వుతున్న నేపథ్యంలో, మంచి పోషకాహారంతో పాటు క్రమం తప్పని వ్యాయామం తప్పనిసరని చాలామంది గ్రహించారు. ఒత్తిడితో కూడిన జీవనశైలిలోనూ ఉదయం ఒక గంటను వ్యాయామానికి కేటాయిస్తున్నారు. ఈ సాధనకు తోడుగా నిలుస్తున్న కొన్ని ఆధునిక పరికరాలివి.

డిజిటల్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌:

స్మార్ట్‌ యోగా మేట్‌

కోవిడ్‌ తర్వాత ఆన్‌లైన్‌ యోగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు సాంకేతికత ఒక అడుగు ముందుకు వేసి స్మార్ట్‌ యోగా మేట్‌ను తెచ్చింది. దీనిలోని సెన్సార్లు ఆసనాలు సరిగా వేస్తున్నామా లేదా అని గమనిస్తాయి. తప్పు జరిగితే ఎక్కడ సరిచేసుకోవాలో చెబుతూ, నిజమైన యోగా గురువులా మార్గదర్శనం చేస్తాయి.

స్మార్ట్‌ షూ: ప్రతి అడుగుపై విశ్లేషణ

కృత్రిమ మేధ, ప్రత్యేక సెన్సార్లతో రూపొందిన షూలు రన్నర్లకు, వాకర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇవి నడకను, కండరాల కదలి కలను మ్యాప్‌ చేసి కండరాల పనితీరును తెలియజేస్తాయి. వేగం, బలం వంటి అంశాలను అంచనా వేయడానికి కూడా ఉపయోగపడతాయి.

జిమ్‌లను దాటి సెన్సార్ల బాటలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement