స్టేషన్లు
ఎన్నికల నిర్వహణకు అధికారుల ముమ్మర ఏర్పాట్లు
10 జోన్లు.. 120 వార్డులు.. 1,990 పోలింగ్ కేంద్రాలు
18.29 లక్షల మంది ఓటర్లు.. 14,328 మంది పోలింగ్ సిబ్బంది
గాజువాకలో అత్యధికంగా 329.. అగనంపూడిలో అత్యల్పంగా 75 బూత్‌లు
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రక్రియను సమర్థంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల బరిలో తలపడేందుకు సన్నద్ధమవుతున్నాయి. వార్డుల పునర్విభజనతోపాటు వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెరగడం, మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల ఎంపిక, ఎన్నికల సామగ్రి భద్రత, సిబ్బంది విధుల నిర్వహణ, పోలీసు బందోబస్తుపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.
స్వర్ణభారతిలో ఎన్నికల సామగ్రి భద్రం
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సంబంధిత పంపిణీ కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఎన్నికల సామగ్రిని భద్రపరిచారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూము లు, ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలోని ప్రిన్సిపల్ బ్లాక్, న్యూ క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభా గం భవనాలను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తగిన వెలుతురు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, పటిష్టమైన పో లీసు భద్రత కల్పించనున్నారు. సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక మా ర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు ఈనెల 13, 14 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
మొత్తం ఓటర్లు 18,29,966 పోలింగ్ కేంద్రాలు 1,990 నిర్వహణా జోన్లు 10 మొత్తం వార్డులు 120 పోలింగ్ సిబ్బంది 14,328 మంది
పోలింగ్ కేంద్రాల వర్గీకరణ
అత్యంత సమస్యాత్మక : 91
సమస్యాత్మక : 313
క్రిటికల్ కేంద్రాలు: 393
సాధారణ కేంద్రాలు: 1,193
జోన్‌లు వార్డులు పోలింగ్ ఓటర్లు
జోన్–1(భీమిలి) 5 78 66,446
జోన్–2(మధురవాడ) 7 162 1,49,452
జోన్–3(తూర్పు) 18 309 2,96,124
జోన్–4(దక్షిణ) 16 249 2,17,817
జోన్–5(ఉత్తర) 20 302 2,91,691
జోన్–6(పశ్చిమ) 17 245 2,14,094
జోన్–7(గాజువాక) 19 329 2,98,229
జోన్–8(అగనంపూడి) 5 75 69,796
జోన్–9(అనకాపల్లి) 6 89 76,950
జోన్–10(పెందుర్తి) 7 152 1,49,367
10 జోన్లు 120 1990 18,29,966
ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ ఆదేశించారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దయానిధితో కలిసి ఆయన ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అభ్యర్థులకు నామినేషన్లు, ఎన్నికల గుర్తుల కేటాయింపు, అనుమతులు, ప్రచార వ్యయ నమోదు అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.


