కలెక్టర్‌ను కలిశారని కక్ష | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిశారని కక్ష

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

● డ్యూటీ వేయకుండా అడ్డుకున్న కేజీహెచ్‌ సెక్యూరిటీ యాజమాన్యం ● సెక్యూరిటీ గార్డు ఆందోళన

మహారాణిపేట: పెండింగ్‌ జీతాలు చెల్లించాలని, నెలకు రూ.26 వేల జీతం ఇవ్వాలని పీజీఆర్‌ఎస్‌లో వినతి ఇచ్చిన కేజీహెచ్‌ సెక్యూరిటీ గార్డుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేజీహెచ్‌ సూపర్‌వైజర్‌ తమను వేధిస్తున్నారని సీపీఎం నాయకులతో పాటు కొంతమంది కేజీహెచ్‌ సెక్యూరిటీ సిబ్బంది సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో మంగళవారం కేజీహెచ్‌ సెక్యూరిటీ గార్డు సంతోషికి డ్యూటీ వేయకుండా పక్కన పెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా సెక్యూరిటీ డ్రెస్‌లో కలెక్టర్‌ను ఎందుకు కలిశారని సూపర్‌వైజర్‌ తనతో గొడవ చేశారని, అందువల్లే మంగళవారం డ్యూటీ వేయలేదని సంతోషి ఆరోపించారు. డ్యూటీ వేయకపోవడంతో ఆమె కేజీహెచ్‌లో ఆవరణలో ఆందోళన చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement